telangana
వివాహ వార్షికోత్సవం సందర్భంగా 110 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ
సూర్య కరీంనగర్ : తమ వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జిల్లా రవికుమార్ దంపతులు కపిల్ బాలకుటీర్ విద్యార్థులకు 110 దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆడంబరాలకు దూరంగా బాలబాలికల మధ్య వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పలువురు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, కోల అన్నారెడ్డి, పుల్లాల శ్యామ్, బల్మూరి కరుణాకర్ రావు, వకుల దేవి, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.