telangana
101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
సూర్య కరీంనగర్ : కార్తీకమాసం సందర్భంగా చైతన్యపురిలో నలుమాచు మనోహర్, రాధ దంపతుల స్వగృహంలో తొమ్మిదోసారి 101 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర్ శర్మ, గోవిందవరపు భూ శంకర శర్మ ఆధ్వర్యంలో వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్యాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని, మానవసేవే మాధవసేవగా భావించాలని పిలుపునిచ్చారు. అనంతరం భజనలు, సత్సంగం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. దాదాపు 800 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.