BREAKING
మెరుగైన రవాణా సౌకర్యం కోసం సీసీ రోడ్ల నిర్మాణం మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీరభద్రరావు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ వీరాభిమాని, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఎన్టీఆర్ రాజు సంవత్సరీకం.. హాజరై నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొరకు ఏర్పాట్లు పూర్తి ఐవోనెసిమాబ్ దరఖాస్తును తిరస్కరించిన యూఎస్ ఎఫ్డీఏ గ్రామ అభివృద్ధికి కృషి- నామినేషన్ దాఖలు చేసిన మట్ట వనజాక్షి భక్తిభావానికి ప్రతిరూపం అనంత రూరల్ లో ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్లు మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్

Select Suryaa Now
మెగా కుటుంబం నుంచి మరో యంగ్ హీరో సందడి.. ఘనంగా కొణిదెల పవన్ తేజ్ 'జంట' టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మెగా కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన యువ కథానాయకుడు కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జంట. పాడని కుమార్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వసుంధర ఆర్ట్స్ పతాకంపై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక విభిన్నమైన ప్రేమ, యాక్షన్ కథాంశంతో దర్శకుడు రాజశేఖర్ యాదవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కోనసీమ అందాలకు నెలవైన అమలాపురం ప్రాంతంలో దసరా బుల్లోడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు చిత్రీకరణ జరుపుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు జంట సినిమా షూటింగ్‌కు కూడా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. హీరోగా ఇది రెండో సినిమా అయినప్పటికీ, ఈ చిత్రంతో కొణిదెల పవన్ తేజ్ మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా గొప్ప పేరు తెచ్చుకోవాలని మెట్ల రమణబాబు ఆకాంక్షించారు. రెండు నెలల పాటు అమలాపురం పరిసరాల్లోనే పూర్తి స్థాయి చిత్రీకరణ జరపబోతున్నట్లు సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాస్తవ్ వెల్లడించారు.

నిర్మాత రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ ఈ కథ కోసం రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నామని, తమ సొంత ప్రాంతమైన అమలాపురంలోనే షూటింగ్ జరుపుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. దర్శకుడు రాజశేఖర్ యాదవ్ ప్రతిభ వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చిందని, ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఒక క్రియేటివ్ డైరెక్టర్ లభిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒక యుద్ధం ఊరి మీదకు వస్తే ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో ఈ కథలో చూపించబోతున్నామని, ఇందులో సరికొత్త యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ వివరించారు. తెలుగులో తనకు ఇదే తొలి చిత్రమని, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని హీరోయిన్ పాడని కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.

హీరో కొణిదెల పవన్ తేజ్ మాట్లాడుతూ మొదట హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేయాలని భావించినప్పటికీ, ఆంధ్రా ప్రాంతంలోనూ సినిమా చిత్రీకరణలు జరగాలనే ఉద్దేశంతో అమలాపురానికి మారామని చెప్పారు. రెండేళ్లుగా ఈ కథతో ప్రయాణిస్తున్నానని, వేరే సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఈ బలమైన కథ కోసమే వేచి చూశానని తెలిపారు. యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో అనే క్యాప్షన్ తమ కథకు ఎంతో సరిపోతుందని, మంచి భావోద్వేగాలు, మాస్ అంశాలతో రాబోతున్న జంట చిత్రంతో తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తామని పవన్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.