స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీరభద్రరావు
కొయ్యలగూడెం రూరల్ , మేజర్ న్యూస్ :గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అని బోడిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ దాకాలు చేసిన స్వతంత్ర అభ్యర్థి గర్రె వీరభద్రరావు పేర్కొన్నారు. బోడిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న అంకాల గూడెం, బర్కత్ నగరం, ఊట్ల గూడెం, గ్రామాలలో మౌలిక సదుపాయాల కోసం కృషిచేసి, గ్రామాలలో డ్రైనేజీలు, సిసి రహదారులు, మంచినీటి సమస్య, వీధిలైట్లు, డ్రైనేజీ పూడికతీతలు, ప్రతి వీధిలో ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రత తో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని, బోడిగూడెం పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి ఓటర్లు అంతా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి భద్రరావు కోరారు. ఊరంతా జన సమూహంతో వందలాదిమంతొ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది.