BREAKING
స్వగ్రామం రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రి చివరి కోరిక నెరవేర్చిన కుమారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర వైసీపీదే. జడ్పిటిసి శివరుద్రప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా ఘన సన్మానం సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు!

ప్రజాసేవ కోసం ఒక్కసారి అవకాశం కల్పించండి

Select Suryaa Now
ప్రజాసేవ కోసం  ఒక్కసారి అవకాశం కల్పించండి

నల్లమాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలో ఉంటున్నానని సర్పంచ్ అభ్యర్థి టీడీ రఘునాథరెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచారాన్ని కార్య క్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ సంద ర్భంగా పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్కరినిఆప్యాయంగా కలుసుకుంటూ తనకు ఒక అవ కాశం కల్పించాలని, తమఅమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిం చాలనిఅభ్యర్థించారు.వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చెరువువాండ్లపల్లి, కొత్తపల్లి, నల్లమాడ ఎస్సీ కాలనీలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యు లను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసు కున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం పదవి కోసం కాదని, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశం తోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చానని వివరించారు. సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూవారి సమ స్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.చెరువు వాండ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రహదారులు, పారి శుద్ధ్యం, తాగునీరు తదితర ప్రజా అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిం చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టు కుంటానని, ప్రతి ఒక్కరి అభిప్రాయా నికి విలువనిస్తూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొ న్నారు.కాగా, టీడీ రఘునాథరెడ్డి కుటుంబానికి నల్లమాడ ప్రజలతో కొన్ని దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉండటంతో ప్రచా రంలో పలువురు ఓటర్లుఆప్యాయంగా పలకరించారు. ఆయన కుటుంబం గత ఎనిమిదేళ్లుగా సుమారు రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా స్వచ్ఛ మైన తాగునీరు అందిస్తున్న విషయాన్ని ప్రచార కార్యక్రమంలో ఓటర్లు సూచించారు ప్రజలకు అందుబా టులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబం నుంచి అభ్యర్థిగా రావడం పట్ల కొందరు సాను కూలంగాస్పందించారు. ప్రచార సమ యంలో తమ మద్దతుఉంటుందని, ఓటు వేస్తామని పలువురు భరోసా ఇచ్చారు..ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలనుతెలుసుకోవడం, అవసర మైన సమయంలో అండగా నిలవడం తనకు ఎంతో ముఖ్యమని టీడీ రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనను నమ్మి ఎన్నికల బరిలోకి దిగేలా ప్రోత్సహించిన ప్రజల నాయకులు ఆకాంక్షలకు అనుగు ణంగా పనిచేస్తానని, సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే నల్లమాడ పంచా యతీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి ల సహకారంతో  ముందుకు వెళ్లి అభివృద్ధికి బాటలో వేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్య క్రమంలో పంచా యతీ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.