వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక
మాకవరపాలెం, నవంబర్ 15 మేజర్ న్యూస్:
మాకవరపాలెం మండల బీజేపీ ఉపాధ్యక్షుడు రుత్తల రమేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పైడిపాల గ్రామానికి చెందిన ఆయన ఆదివారం తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గణేశ్ పార్టీ కండువా కప్పి రమేశ్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు అనుచరులు కూడా వైసీపీ కండువాలు ధరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు రుత్తల శ్రీను, గోవింద తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్
ఏ అప్పలనాయుడు