కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జ్ సీఐ కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఎస్‌ఐ చెంచయ్య, ఏఎస్‌ఐ షేక్ మహబూబ్ బాషా మరియు సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త మార్కెట్ వడ్డీ పాలెం మధ్య ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3 కోళ్లు, ఒక మోటార్ సైకిల్, రూ.620 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని చట్టపరమైన చర్యల నిమిత్తం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని పోలీసులు సూచించారు.