అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు!
ఒంగోలు, మేజర్‌న్యూస్:
ఆకలిగొన్న అన్నార్తులకు పట్టెడన్నం పెట్టిన సేవను మించిన స్వచ్ఛమైన ప్రేమ మరొకటి లేదని, సేవా మార్గంలో పయనిస్తున్న మా మిత్రులు రచయిత డాక్టర్ మెుగిలి దేవ ఆధర్శనీయులని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు అన్నారు. ఆదివారం CITU నాయకులు కామ్రేడ్ మెుగిలి ఆనందరావు గారి జ్ఞాపకార్థం.. వారి కుమారుడు డాక్టర్ మెుగిలి దేవ,కృష్ణవేణి దంపతుల ఆధ్వర్యంలో నాలుగు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. శివం శరణాలయంలో సేవా కార్యక్రమంలో.. ₹10 వేల రూపాయలు విలువైన బియ్యం బస్తాలు, వంట నూనె డబ్బాలు, నిత్యావసరాలు, కాయలు పండ్లు వితరణ చేశారు. వృద్ధులకు,అన్నార్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. దీనికి ముందు బొమ్మరిల్లు అనాథాశ్రమంలోని విద్యార్థులకు ₹ 10 వేలు రూపాయలు విలువైన బియ్యం బస్తాలు, వంట నూనె డబ్బాలు, నిత్యావసరాలు, కాయలు పండ్లు వితరణ చేశారు. తొలుత గుడ్ న్యూస్ అంధుల పాఠశాల విద్యార్థులకు.. మరియు బలరాం కాలనీలోని ఉషోదయ వృధ్దాశ్రమం వారికి ₹ 20 వేలు రూపాయలు విలువైన బియ్యం బస్తాలు,వంట నూనె డబ్బాలు, ఫ్యాన్సీ సరుకులు, నిత్యావసరాలు, కాయలు పండ్లు వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమాలలో.. మెుగిలి సత్యవతి,వాసు,మెజీషియన్ రామన్ తదితరులు పాల్గొన్నారు.