ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
సూపర్ స్టార్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు సీవీన్ రీడింగ్ రూమ్ లో ఘనంగా నట శేఖర కృష్ణ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో కృష్ణ అభిమానులు, వివిధ సాహిత్య, కళా కారుల సంఘాల ప్రతినిధులు పాల్గొని కృష్ణ సేవలను కొనియాడారు కృష్ణ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి నివాళి అర్పించారు కవి, రచయిత జాలాది మోహన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ అనేకవిదాలుగా ప్రజలకు అవసరమైనప్పుడు సేవలు అందించరని గుర్తుచేశారు. జాలాది మోహన్ మాట్లాడుతు కృష్ణ సినిమా రంగాణ్ణి విస్తరింపజేసి ఒక పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చి ఎందరికో అవకాశాలను కల్పించాడని మోసగాళ్ళకు మోసగాడు సినిమా ద్వారా తెలుగు సినిమాకు అంతర్జాతీయ కీర్తిని తీసుకువచ్చడని అన్నారు. దాదాపు ప్రతి సినిమాలో కొత్తదనాన్ని పరిచయం చేయాలని ప్తయత్నించాడని అయన చేసిన ప్రయోగాలు అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాయని అన్నారు. హీరోయిన్ లేని ఈనాడు వంటి సినిమాలు తీసి కార్మికులపక్షాన నిలిచాడని, పాడిపంటలు, బంగారు భూమి, ప్రజా రాజ్యం సినిమాలతో రైతుల పక్షాన సినిమాలు తీసి ప్రజాపక్షం వహించాడని అన్నారు. అతని సినిమాలకోసం అంతకుముందున్న టాకీసుల్ని కొత్త థియేటర్ లను నిర్మించారాని జాలాది మోహన్ అన్నారు.కృష్ణ క్షమా, మంచితనం అందరికి సహాయం చేసి అమరుడయ్యాడని అన్నారు.ఈ కార్యక్రమానికి కవి ,రచయిత, వ్యక్తిత్వ వికాసకులు సూపర్ స్టార్ కృష్ణ పరిషత్ అధ్యక్షులు జాలాది మోహన్ ఆధ్వర్యంలో జరిగింది రంగభూమి కళాకారుల సంగం నాయకులు దేనువకొండ సుబ్బయ్య, అంగలకుర్తి ప్రసాద్ , బెతంశెట్టి హరిబాబు, అనంత లక్ష్మి, sk బాబు, పొదిలి బాలగురవయ్య,చిడితోటి బాబురావు, మాకా ఆంజనేయులు sk నజీర్, శివ పాలేటి కోటేశ్వరరావు, కొత్తపట్నం రాత్తయ్య, రాజేరాజేశ్వరి పాల్గొని కృష్ణకు నివాళులు అర్పించారు