BREAKING
కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్ కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్... కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.... ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు జైలర్ 2 నుంచి 'బిందాస్' ఫుల్ వీడియో సాంగ్ విడుదల.. రజినీకాంత్, నోరా ఫతేహి జోరు పుట్టినరోజు పేదల సేవకు ఆర్భాటాలకు దూరం ఉచిత మెగా వైద్య శిబిరం. సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు సీనియర్ జర్నలిస్ట్ "సోమా"కు జాతీయ పురస్కారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యా విజయానికి బలమైన పునాది నాన్నగారి బయోపిక్ తీస్తానంటే నిర్మాతగా ఉంటా కానీ అందులో నటించలేను.. మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఘనంగా దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' ప్రీ రిలీజ్ ఈవెంట్ సమిష్టిగా పోరాడి సర్పంచ్ గెలుపు సాదించాలి.. ఎర్రకోట గురుకులంలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం...

జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో ఎంపీ చామల తెలంగాణలో జపాన్ పెట్టుబడులు,

Select Suryaa Now
జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో ఎంపీ చామల తెలంగాణలో జపాన్ పెట్టుబడులు,

తెలంగాణ బ్యూరో ప్రతినిధి: జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో భోంగిర్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. 2025 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జపాన్‌లోని కిటాక్యూషు, హిరోషిమా నగరాల్లో పర్యటించిన సందర్భంగా ప్రతిపాదించిన 86 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఎకో టౌన్‌షిప్ అభివృద్ధి, గ్రీన్ కొలాబరేషన్ ఒప్పందం గురించి చర్చించారు. అలాగే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జెఐసిఎ) ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించే అవకాశాలను చర్చించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హెచ్‌ఐటి)తో విద్యా, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చ జరిగింది.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్‌) ద్వారా తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. హెల్త్‌కేర్, కేర్‌గివింగ్, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాల్లో జపాన్‌లో ఉన్న మానవ వనరుల అవసరాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునే అవకాశాలను వివరించారు. అదేవిధంగా జపాన్‌లో ఉద్యోగాల కోసం అవసరమైన స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ (ఎస్‌ఎస్‌డబ్లూ) వీసా, టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (టిఐటిపి), ఇతర ప్రొఫెషనల్ వర్క్ వీసాలు, నైపుణ్య పరీక్షలు, జపనీస్ భాషలో జెఈటి-బేసిక్, జెఎల్‌పిటి ఎన్‌4 వంటి అర్హతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెట్టుబడులు, పర్యావరణహిత అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, విద్యా భాగస్వామ్యాలు, యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తెలంగాణ–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.