BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్

Select Suryaa Now
కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

జిల్లా పోలీస్ యంత్రాంగం వేగవంతంగా స్పందించి చేపట్టిన చర్యలతో భారీ చోరీల ప్రణాళికను భగ్నం చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రిన్స్ జ్యువెలరీ షాపులో జరిగిన దొంగతనం కేసును కర్లపాలెం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 2.387 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, నేరానికి ఉపయోగించిన మహీంద్రా థార్ కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గారు కేసు వివరాలను వెల్లడించారు.

ఫిర్యాదు వివరాలు:

తేదీ 10.11.2026న తెల్లవారుజామున సుమారు 03.00 గంటల సమయంలో బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్లపాలెం సెంటర్‌లో ఉన్న ప్రిన్స్ జ్యువెలరీ షాపు షట్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి, షాపులోని వెండి ఆభరణాలను దొంగిలించుకుని వెళ్లారు. ఈ ఘటనపై షాపు యజమాని షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు జరిగిన తీరు:

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో, బాపట్ల డీఎస్పీ సిహెచ్. చంద్ర మౌళి ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సీఐ బి. హరికృష్ణ, కర్లపాలెం ఎస్‌ఐ ఎస్. రవీంద్ర తమ స్టేషన్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రత్యేక పోలీస్ బృందం ఘటనా స్థల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో నేరానికి ఉపయోగించిన మహీంద్రా థార్ కారును గుర్తించి, దాని ఆధారంగా నిందితులను గుర్తించారు. వేజెండ్ల గ్రామానికి చెందిన వేజెండ్ల జోసెఫ్ @ జుషప్ (24), జాగర్లమూడికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రషీద్ (26), గరువుపాలెం గ్రామానికి చెందిన సైదుల మనోజ్ కుమార్ (24), తోమాటి వంశీ (26)లను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి సుమారు రూ.4,00,000/- విలువైన 2,387 గ్రాముల వెండి వస్తువులు, మహీంద్రా థార్ కారు, ఒక మోటార్ సైకిల్, దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార, ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని బాపట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి, అంగళకుదురు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో ఇళ్లు, బంగారు ఆభరణాల దుకాణాలను ముందుగానే లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించింది. అనంతరం పక్కా ప్రణాళికతో వరుస దొంగతనాలకు పాల్పడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కర్లపాలెం సెంటర్‌లోని ప్రిన్స్ జ్యువెలరీ షాపు షట్టర్‌ను గడ్డపార, ఇనుప రాడ్డుతో పగులగొట్టి, అందులోని వెండి ఆభరణాలను దొంగిలించుకెళ్లింది.

అయితే, నిందితులు మరిన్ని దొంగతనాలకు పాల్పడకముందే, మొదటి నేరం జరిగిన వెంటనే కర్లపాలెం పోలీసులు వేగంగా స్పందించి, కేవలం రెండు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేయడంతో భారీ చోరీల ప్రణాళికను భగ్నం చేయగలిగారని ఎస్పీ గారు తెలిపారు.

నిందితుల నేర చరిత్ర:

అరెస్టయిన నలుగురు నిందితులపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదై ఉన్నాయని, వీరి నేర చరిత్రను పరిశీలిస్తే వీరు పాత నేరస్థులని ఎస్పీ గారు తెలిపారు.

ప్రధాన నిందితుడు A1 వేజెండ్ల జోసెఫ్‌పై గతంలో చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు కలిపి మొత్తం 3 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి.

A2 మహమ్మద్ అబ్దుల్ రషీద్‌పై తెనాలి III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, తెనాలి II టౌన్, చేబ్రోలు, ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క కేసు చొప్పున మొత్తం 8 కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో 6 దొంగతనం కేసులు కాగా, 2 గంజాయి కేసులు ఉన్నాయి.

అలాగే, A3 సైదుల మనోజ్ కుమార్‌పై చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, A4 తోమాటి వంశీపై బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదై ఉన్నాయి.

పోలీస్ సిబ్బందికి అభినందనలు:

కేసు నమోదైన వెంటనే వేగంగా స్పందించి, కేవలం రెండు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేసి, మరిన్ని దొంగతనాలు జరగకుండా సమర్థవంతంగా అడ్డుకున్న బాపట్ల డీఎస్పీ సిహెచ్. చంద్ర మౌళి, బాపట్ల రూరల్ సీఐ బి. హరికృష్ణ, కర్లపాలెం ఎస్‌ఐ ఎస్. రవీంద్ర, హెడ్ కానిస్టేబుళ్లు ఐ. నరేష్, కె. శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వి. శివ శంకర్ రావు, డి. రాకేష్ వర్మ, హోంగార్డు ఎం. దిలీప్ రెడ్డిలను జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి, నగదు బహుమతులు అందజేశారు.

విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్, బాపట్ల డీఎస్పీ సిహెచ్. చంద్ర మౌళి ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ సీఐ బి.హరికృష్ణ, కర్లపాలెం ఎస్‌ఐ ఎస్.రవీంద్ర, కర్లపాలెం స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.