andhrapradesh
చదువుతోపాటు ఆటలు అవసరమే
అవనిగడ్డ, మేజర్ న్యూస్ పాఠశాలలో పిల్లలకు చదువుతోపాటు ఆటలు ఎంత అవసరమని ప్రిన్సిపాల్ చందన బాబురావు అన్నారు. ఆదివారం స్థానిక నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాజ్యోతి నీ ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారుఆటల ద్వారా పిల్లలలో శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఫ్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం అంబరిల్లా రేస్, సైకిల్ రేస్, రన్నింగ్ రేస్ వంటి వినోదాత్మక క్రీడా పోటీలను నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొని తమ ప్రతిభలను ప్రదర్శించారు. వీటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ ప్రతిభ, ఏవో సుబ్రహ్మణ్యం, ఈ-చాంప్స్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఈ కిడ్స్ ప్రిన్సిపల్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.