వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు
మార్టూరు, మేజర్ న్యూస్:
సేవే లక్ష్యంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మార్టూరులోని కార్తీక్ హాస్పిటల్ ప్రక్క సందులో ఉన్న వెంగమాంబ నిలయం వద్ద పత్తిపాటి వెంగళరావు అనే వికలాంగుడికి వీల్‌చైర్‌ను అందజేశారు. రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు జాస్తి సాంబశివరావు సహకారంతో ఈ వీల్‌చైర్‌ను అందించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం, వారి జీవితాల్లో కొంతైనా సౌలభ్యం కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కొర్రపాటి సుబ్రహ్మణ్యం, మాజీ అధ్యక్షులు జాస్తి సాంబశివరావు, షేక్ ఖాజా హుస్సేన్, మాదాల సాంబశివరావు, ట్రెజరర్ గరిమిడి శ్రీనివాసరావు, రొటేరియన్లు చెరుకూరి నాగేశ్వరరావు, గోనుగుంట్ల రవికుమార్, చల్లగుండ్ల శ్రీనివాసరావు, మోత్కుపల్లి అంకయ్య తదితరులు పాల్గొన్నారు. వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ సభ్యులకు పత్తిపాటి వెంగళరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.