BREAKING
కళామతల్లి సేవలో శ్రీరామ నాట్యమండలి - 205 నాటక ప్రదర్శనలు ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తాం: మంత్రి నారాయణ సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్‌చెరు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామా! బాపట్ల జిల్లాలో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు – 150 నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు గిరిజన హక్కుల కోసం బీర్సా ముండా అలుపెరగని పోరాటం తెలుగుదేశం పార్టీలో చేరిన ములుమూడి చెందిన షేక్ సర్దార్, షేక్ కాలేషా మిత్రబృందం ప్రజల భద్రత మా ప్రాధాన్యత – మూగజీవుల సంక్షేమం మా బాధ్యత వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు

జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర

Select Suryaa Now
జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఎం. వి. రావు ఫౌండేషన్ ద్వారా జాతీయ జర్నలిస్ట్ పురస్కారం అందుకున్న ఆత్మకూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఏ పి యూ డబ్ల్యూ జె జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్, ఎల్ ఆర్ పల్లి జెడ్పి హైస్కూల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, శ్రీరామా నాట్యమండలి అధ్యక్షుడు సోమా వెంకటసుబ్బయ్య ను పలువురు అభినందించారు.జాతీయ పురస్కారం అందుకున్న సీనియర్ జర్నలిస్టు సోమా వెంకటసుబ్బయ్య కు హృదయపూర్వక అభినందనలు ఎపి రైతుసంఘ జిల్లా ఉపాధ్యక్షుడు లక్కు కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఆత్మకూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సోమా వెంకటసుబ్బయ్య గారికి ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం లభించడం ఎంతో సంతోషకరం, గర్వకారణం అన్నారు.
జర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు, ప్రజా సమస్యల పట్ల ఉన్న నిబద్ధతకు లభించిన ఈ గౌరవం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకుంటూ, ఆయురారోగ్యాలతో, ఆనందంగా, జర్నలిజం రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని,
సోదర సమానులైన సోమా వెంకటసుబ్బయ్యకు  హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ పురస్కారం అందుకున్న వెంకటసుబ్బయ్య కు ఆత్మకూరు ప్రాంత, జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, యు ట్యూబ్, సోషల్ మీడియా జర్నలిస్తులు, శ్రీరామా నాట్యమండలి సభ్యులు, వివిధ ప్రజాసంఘాల, పార్టీల ప్రతినిధులు, బంధువులు, మిత్రులు అభినందనల పరంపర సాగించారు.