కళామతల్లి సేవలో శ్రీరామ నాట్యమండలి - 205 నాటక ప్రదర్శనలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరులో కళాభిమానులుగా ఉన్న మిత్ర బృందం పాతికేళ్ల క్రితం శ్రీరామానాట్య మండలి స్థాపించి రిజిస్టర్ చేయించి రంగస్థలంపై కాలు మోపి 205 నాటక ప్రదర్శనలు ఇచ్చి ప్రజలకు వినోదాన్ని అందించి కళామతల్లి సేవలో కొనసాగుతున్నారు. శ్రీరామానాట్యమండలి అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ సోమా వెంకటసుబ్బయ్య,ప్రధాన కార్యదర్శిగా డిసిపల్లికి చెందిన గవిని సత్యంబాబు, ఉపాధ్యక్షుడుగా వీర్లగుడిపాడుకు చెందిన చిల్లకూరు కృష్ణారెడ్డి, కోశాధికారిగా ప్రస్తుత రిటైర్డ్ హై స్కూల్ టీచర్ పఠాన్ చాంద్ భాషా, సంయుక్త కార్యదర్శిగా చిట్టమూరు గోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సోమశిల రత్నం బాబు, పసుపులేటి రమేష్ మోహన్ బాబు, ఎం.గౌరీ శంకర్ తదితరులు శ్రీరామనాట్యమండలి స్థాపించి రంగస్థలంపై నాటకాలు ప్రదర్శించారు. ఈ బృందం సభ్యులు రంగస్థలంపై సత్యహరిశ్చంద్ర,భక్త చింతామణి, బాలనాగమ్మ, గయోపాఖ్యానం తదితర నాటక ప్రదర్శనలు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు. అధ్యక్షుడుగా ఉన్న సోమా వెంకటసుబ్బయ్య సత్య హరిచంద్ర నాటకంలో అడవి సీను, బాలనాగమ్మ లో ఒకటవ బాలవర్ధి, భక్త చింతామణిలో బిల్వమంగళుడు పాత్రలు పోషించేవారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న గవిని సత్యంబాబు సత్య హరిశ్చంద్ర నాటకంలో వారణాసి,కాటిసీను, బాలనాగమ్మ నాటకంలో కార్యవర్ది, భక్త చింతామణి నాటకంలో భవానిశంకర్, గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణ, అర్జున పాత్రలు పోషించేవారు. కోశాధికారిగా ఉన్న పీ.చాంద్ బాషా సత్య హరిచంద్ర లో విశ్వామిత్రుడు,కాలకౌశికుడు,బాలనాగమ్మ లో మాయల పకీర్, భక్త చింతామణిలో సుబ్బిశెట్టి పాత్రలు పోషించేవారు. చిల్లకూరు కృష్ణారెడ్డి గయోపాఖ్యానంలో అర్జునుడు,సత్యహరిచంద్ర లో నక్షత్రకుడు, బాలనాగమ్మ లో రెండవ బాలవర్ధి, భక్త చింతామణి లో దామోదర పాత్రలు పోషించేవాడు.చిట్టమూరు రు గోపాల్ రెడ్డి సత్య హరిశ్చంద్ర లో ఒకటవ హరిశ్చంద్రుడుగా, బాలనాగమ్మలో పులి రాజుగా, భక్త చింతామణిలో రెండవ బిల్వమంగళుడుగా పాత్రలు పోషించేవారు. ఇటీవల గోపాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.ఎం గౌరీ శంకర్ సత్యహరిచంద్ర లో సత్య కీర్తి,శిష్యుడు,బాలనాగమ్మ లో చాకలి తిప్పడు, తలారి రాముడు, భక్త చింతామణిలో శ్రీహరి పాత్రలు పోషించేవారుm ఎస్వీ.రత్నం బాబు బాలనాగమ్మలో ఒకటో మాయలు పకీరుగా, భక్త చింతామణిలో రెండవ సుబ్బిశెట్టిగా, సత్య హరిచంద్రలో వీరబాహుడు గా పాత్రలు పోషించేవాడు. మొదట్లో పసుపులేటి రమేష్ మోహన్ బాబు మాయల పకీరు పాత్ర పోషించారు.దేవరపాటి చిన్న సత్యహరిచంద్రలో శిష్యుడు పాత్ర పోషించేవాడు.ఈ బృందం ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాలలో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. మర్రిపాడు,అనంతసాగరం, ఏఎస్పేట, సంఘం, వింజమూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. దాంతోపాటు అత్యంత ప్రాధాన్యత కలిగిన దుత్తలూరు మండలం నర్రవాడలో వెంగమాంబ సన్నిధిలో ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటక ప్రదర్శనలు ప్రదర్శించేవారు. ప్రముఖ వరసిద్ధి వినాయక స్వామి వెలసి యున్న కాణిపాకం లో కూడా వారు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారు నాటక ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు కళా సంస్థ ద్వారా వివిధ రకాల కళాకారులకు అనేక సమస్యల పరిష్కారంలో వృద్ధ కళాకారుల పెన్షన్లు ఇప్పించడంలో వివిధ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరలు చూపి జిల్లాలోనే అత్యధికంగా ఆత్మకూరు ప్రాంతంలో వృద్ధ కళాకారులకు పెన్షన్లను మంజూరు చేయించారు. వారి సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న శ్రీరామనాట్యమండలి ప్రతినిధులు తమ వంతుగా రంగస్థలం నాటక ప్రదర్శనలు ఇస్తూ కళామతల్లి సేవలో కొనసాగుతున్నారు. శ్రీరామ నాట్యమండలి కళాబృందం సభ్యులు కళాకారులుగా ఉన్న రేబాల శ్రీలక్ష్మి, వాణి సింగరాయకొండ పద్మ, సింగరాయకొండ ఝాన్సీ, రమణశ్రీ,పద్మాంజలి,మనోరమ,చంద్రకళ జయసుమ విమలాదేవి, సులోచన దేవి, అపర్ణ,లక్ష్మీ కామేశ్వరి గూడూరు సావిత్రి,వనారస్ లక్ష్మి, సింగరాయకొండ లక్ష్మమ్మ,తదితర ప్రముఖ నటీమణులతో ప్రదర్శించారు. శ్రీరామా నాట్యమండలి సభ్యులైన సోమా వెంకటసుబ్బయ్య, గవిని సత్యం బాబు, చిట్టమూరు గోపాల్ రెడ్డి లు ప్రపంచ నాటకదినోత్సవం సందర్బంగా ఉత్తమ కళాకారులుగా అప్పటి జెడ్పి చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ కె. రామ్ గోపాల్ చేతులమీదుగా అవార్డులు అందుకున్నారు.కాగా ఔత్సాహిక కళాకారులుగా ఉన్న శ్రీరామ నాట్యమండలి కళాబృందం సభ్యులు గత రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సందేశాత్మకమైన భక్త చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించి వృత్తి కళాకారుల ఉపాధికి భంగం కల్పించారని, ప్రస్తుత ప్రభుత్వ న్యాయపరంగా తగు చర్యలు తీసుకొని చింతామణి నాటకాన్ని పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వపరంగా ప్రస్తుతం ఆదరణ తగ్గుతున్న కళ ప్రదర్శనలు ప్రోత్సహించే విధంగా దేవాలయాలు, వివిధ ఆధ్యాత్మిక సంస్థల్లో నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, అర్హులైన కళాకారులందరికీ వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని, ఇంటి నివేశన స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని,, కళాకారులకు ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ 4000 నుండి 8000 రూపాయలకు పెంచాలని శ్రీరామ నాట్యమండలి ప్రతినిధులు కోరుతున్నారు.