అంబరాన్ని అంటిన బాలల దినోత్సవ వేడుకలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఎం వి రావు ఫౌండేషన్ బాలల దినోత్సవం వేడుకలు నిర్వహించగా ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆదివారం ఎం.వి రావు ఫౌండేషన్ చైర్మన్ ఇచ్చిన పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జర్నలిస్టులు, క్రీడాకారులు, ఎస్ఎస్సి టాపర్లు 2025-26, సాంస్కృతిక జానపద, సినిమా మరియు జబర్దస్త్ కళాకారులకు ఈ వేదిక ద్వారా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చాచా నెహ్రూ చిత్రపటానికి, మరియు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి వారి తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎన్ బి కే ఆర్ ఐ ఎస్ టి విశ్రాంత అధ్యాపకులు విజయ్ కుమార్ రెడ్డి,కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య, జబర్దస్త్ నవ్వుల రారాజు దామోదరం ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ ఎం విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఘన నివాళులర్పించి
రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో దద్దరిల్లిన చెందోడు ఉన్నత పాఠశాల.
చెందోడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఎం వి రావు ఫౌండేషన్ బాలల దినోత్సవ సంబరాలు 2026 కార్యక్రమానికి హాజరైన పలువురు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు.
చిన్నారులు వేసిన క్లాసికల్ డాన్స్, మరియు చెందోడు ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వేసిన మాస్ సాంగ్స్ ఆహుతులను అలరించాయి.
జబర్దస్త్ దామోదర మిమిక్రీ.
జబర్దస్త్ నవ్వుల రారాజు నవ్వుల దామోదర్ ప్రదర్శించిన మిమిక్రీ మరియు ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులను విశేషంగా ఆకర్షించింది.
అదేవిధంగా సభా వేదికపై పలు ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి.
ఆ కొట్టుకున్న పకీర్.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సినీ నటుడు ఫకీర్ ఫేమ్ శీను చేసిన పకీరు ప్రదర్శన మరియు వారి శిష్యుడు ప్రదర్శించిన విశ్వామిత్ర గెటప్పు ఆకర్షించడమే కాక శీను ఏకపాత్రాభినయం కూడా విద్యార్థులు విశేషంగా ఆకర్షించింది.
టెన్త్ టాపర్లకు పురస్కారాలు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి గత విద్యా సంవత్సరంలో ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభావంతులుగా నిలిచిన మేధావులను గుర్తించి వారికి ఏం వి రావు ఫౌండేషన్ నిర్వాహకులు షీల్డ్ ప్రశంసా పత్రం మెడల్ తో ఘనంగా సన్మానించారు
ముఖ్యంగా ఇందులో ప్రగతి కళాశాల విద్యార్థినికి ముందుగా సన్మానం జరిగింది. అనంతరం మిగిలిన పేపర్స్ కు సన్మానం జరిగింది.
బాల మేధావులకు పురస్కారాలు.
ఎం.వి రావు ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన బాలల దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాగటమే కాక విద్యలోనూ, పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులను
గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా వారికి ప్రతిభా పురస్కారాలను ముఖ్య అతిధుల చేతుల మీదుగా పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్రీడాకారులకు సన్మానం.
రాష్ట్రస్థాయిలో దేశస్థాయిలో వివిధ విభాగాలలో క్రీడా నైపుణ్యం పొందిన 30 మంది క్రీడాకారులను వారి నైపుణ్యం ఆధారంగా అత్యంత వైభవంగా సన్మానించారు.
వీరికి ప్రత్యేకంగా షీల్డ్ ప్రశంసా పత్రం మేముటోళ్ళతో వారిని సత్కరించి వారికి శిక్షణ ఇస్తున్న క్రీడాకారులను పీడీలను కూడా సన్మానించడం జరిగింది.
జర్నలిస్టులకు పురస్కారాలు.
గత నెలలో జాతీయస్థాయిలో నిర్వహించిన జర్నలిస్టుల జాతీయ పురస్కారాల కార్యక్రమానికి వివిధ కారణాల వల్ల రాలేకపోయిన జర్నలిస్టులకు పదిమందికి గత జ్ఞాపికలు గాక ప్రస్తుత బాలల దినోత్సవ జ్ఞాపకాలను కూడా వారికి అందజేసి అత్యంత వైభవంగా సన్మానించారు.
సినీ కళాకారులకు సన్మానం.
హైదరాబాదు విజయవాడ ప్రాంతాల్లో ఉన్న సినీ కళాకారులను పలు శాఖల కళా రంగాల వారికి ఫోటోగ్రఫీ డాన్స్ ఇతర విభాగాలలో ప్రతిభ కలిగిన వారికి అత్యంత వైభవంగా సన్మానించారు.
అదేవిధంగా వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన క్రీడాకారిణి మరియు కరాటే మాస్టర్ సుబయాను అత్యంత వైభవంగా సన్మానించడమే కాక...
*ఎం వి రావు ఫౌండేషన్* చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణను కార్యక్రమానికి హాజరైన చిన్నారులు వేదికను అలంకరించిన పెద్దలు ముఖ్య అతిథులు అత్యంత వైభవంగా సన్మానించారు.
ఎం వి రావు ఫౌండేషన్ సేవలు చిరస్మరణీయం.
స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం వి రావు ఫౌండేషన్ గత 19 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒకపక్క సేవా కార్యక్రమాలు మరోపక్క ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రతిభా పురస్కారాలు నిర్వహించడం ఈ కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఎంవి రావు ఫౌండేషన్ సేవలను అందుకుంటున్నారని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చైర్మన్ ముప్పువరపు లీలా మోహన్ కృష్ణ దంపతులను ముఖ్య అతిథులు ఎన్.బి.కె
ఆర్ ఐ ఎస్ టి విశ్రాంత ప్రొఫెసర్ మరియు డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి, ఎం ఈ ఓ మస్తానయ్యలు ప్రసంశించారు.
స్వచ్ఛందంగా స్వతంత్రంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులను ప్రతి ఒక్కరిని అభినందించి వారు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు పౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలియజేసి వారి పురస్కారాలను అందుకుని తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో సుమారు 15 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖలకు చెందిన క్రీడాకారులు కళాకారులు హాజరై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలను ఆస్వాదించారు.