andhrapradesh
విశ్వహిందూ పరిషత్ విస్తరణకు విస్తృత కార్యాచరణ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: విశ్వహిందూ పరిషత్ సంస్థాగత బలోపేతం, విస్తరణ లక్ష్యంగా ఆదివారం అవనిగడ్డ గీతా మందిరంలో విస్తృత కార్యక్రమాల రూపకల్పన సమావేశం నిర్వహించారు. అవనిగడ్డ ప్రఖండ అధ్యక్షుడు కమ్మిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి భూపతిరాజు సుబ్బరాజు, ఉత్తరాంధ్ర సహ ప్రముఖ్ లింగం బసవ శంకరరావు, జిల్లా కార్యదర్శి వరే రాజశేఖర్, జిల్లా మఠ మందిర్ సహ ప్రముఖ్ అన్నపరెడ్డి కృష్ణ, జిల్లా మాతృశక్తి ప్రముఖ్ సాయిలత హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంస్థ విస్తరణ, కార్యకలాపాల బలోపేతం, గ్రామస్థాయిలో సంస్థను మరింత విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
కార్యక్రమంలో అవనిగడ్డ ప్రఖండ ఉపాధ్యక్షుడు మానేపల్లి విజయ్ కుమార్, కార్యదర్శి పూతబోయిన వెంకట సుబ్రహ్మణ్యం, అవనిగడ్డ, నాగాయలంక ఖండాల అధ్యక్షులు గరికిపాటి హరిబాబు, లంకె వర్మతో పాటు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మానేపల్లి సునీల్ కుమార్, గంగుదేవరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.