BREAKING
సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక అధికారులు..దళారుల కుమ్మక్కుతో బీమా అక్రమాలా? కంబదూరు ఎస్సైగా గోపి బాధ్యతలు స్వీకరణ. విశ్వహిందూ పరిషత్ విస్తరణకు విస్తృత కార్యాచరణ 60 ఏళ్ల అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపం దర్శనానికి శ్రీకారం.. పేదల నిరీక్షణకు తెరపడేనా...!? -- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాప్యం తండ్రులు పిల్లల బాధ్యతలు చూస్తే అంతగా పొగుడుతారెందుకు.. ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు అంబరాన్ని అంటిన బాలల దినోత్సవ వేడుకలు కార్తీక మాసం లో.. ఆదివరాహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి సింగరేణి ప్రభావిత నిరుద్యోగ యువతకు ఐటీ నైపుణ్య శిక్షణ మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం సిబ్బంది ఐదు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి రోడ్డుపైనే వాహనాల మరమ్మతులు - ఆటోనగర్ లేని అగచాట్లు

ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తాం: మంత్రి నారాయణ

Select Suryaa Now
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్  :   నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలోనే, ఆదివారం సెలవు రోజైనప్పటికీ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ మోపూరులో ఉన్న వాణిశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ ఎలెక్ట్ రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు.  ​నెల్లూరు నగరంలోని పాఠశాలల తరహాలోనే, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలపై కూడా మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. సౌత్ మోపూరు స్కూల్ ఆవరణను కలియతిరుగుతూ, అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, కల్పిస్తున్న సౌకర్యాలను నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.​పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన నేతలు, సౌత్ మోపూరు జెడ్పీ హైస్కూల్ రూపురేఖలను పూర్తిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం సెలవు రోజున కూడా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలన చేయడం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై తమకున్న నిబద్ధతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ రాపూరు చంద్రశేఖర్,గుండ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పముజుల ప్రదీప్,కనుపూర్ కెనాల్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ తుళ్లూరు రామయ్య మరియు టిడిపి సీనియర్ నాయకులు, గ్రామ టిడిపి అధ్యక్షులు అన్నం సుధాకర్ గౌడ్,స్థానిక టిడిపి ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.