BREAKING
కేటీఆర్‌ను కలిసిన కీసర బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్‌రాజ్ ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతి కుమారి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్.. కంటెస్టెంట్లపై హైపర్ ఆది పంచ్‌లు, కౌంటర్లు డ్రైనేజీ కాలువలో యువకుడి డెడ్బాడీ ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం పేదలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం. 18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఇందుకూరుపేటలో ఖాళీ అవుతున్న వైసీపీ.. టీడీపీలోకి 300 మందికి పైగా చేరిక పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు రామ్ చరణ్ సినిమాలో అవకాశం.. ఆ కారణంతోనే తిరస్కరించానన్న బండి సరోజ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించాలి. 20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు కార్తీక ఆదివారం.. భీమేశ్వరాలయంలో భక్తుల సందడి సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక

రోడ్డుపైనే వాహనాల మరమ్మతులు - ఆటోనగర్ లేని అగచాట్లు

Select Suryaa Now
రోడ్డుపైనే వాహనాల మరమ్మతులు - ఆటోనగర్ లేని అగచాట్లు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరులో ఆటో కార్మికులు 20సంవత్సరాలుగా అరిచి గీపెడుతున్నా ఆటోనగర్ కలగానే మిగలడం, శంకుస్థాపన చేసిన అతిగతి లేకపోవడంతో ఆత్మకూరు పట్టణంలో వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉండగా  జనాలకు అసౌకర్యం కూడా అదే తరహాలో ఉంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి మరమ్మత్తులు చేసుకుంటూ ఉండగా ఆ మార్గంలో వెళ్లే ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బిఎస్ఆర్ సెంటర్ నుండి మండల పరిషత్, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యు ఎస్,ఎక్సయిజ్,వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ తదితర కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూలు, బాలికోన్నత పాఠశాల, వివిధ ప్రవేటు విద్యాసంస్థలకు వెళ్లే రహదారికి ఇరువైపులా ఆటో వర్క్ షాప్లను కార్మికుల ఏర్పాటు చేసుకొని తమ బ్రతుకుదెరువు అనాదిగా సాధిస్తున్నారు. ఈ మార్గంలో వాహనాలను నిత్యం రోడ్డుపై అడ్డంగా పెట్టి మరమ్మతులు చేస్తుంటారు. అదిగాక వెల్డింగ్ పనులు కూడా చేస్తుంటారు. ఈ పరిస్థితి అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, క్రిస్టియన్పేట, మేధరవీధి తదితర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండేవారు. వెల్డింగ్ పనుల వలన కళ్ళకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఆందోళన చెందుతుంటారు.20 సంవత్సరాల క్రితం స్థానిక నాయకుడు, ఆటో కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు సూరా భాస్కర్ రెడ్డి కార్మికులతో కలిసి ఆటోనగర్ సాధనకై పోరాటాలు సాగించారు. ఆటోనగర్కు ప్రత్యేకంగా స్థలం శివార్లలో కేటాయించాలని అనేక దపాలు రాస్థారోకోలు, ధర్నాలు కార్యక్రమాలు నిర్వహించారు. అనేకమంది తాసిల్దారులు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోనందున సురా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టగా అధికారులు హామీలు ఇచ్చి విరమింప చేశారు. కాగా 2016-17 లో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పి కృష్ణయ్య తదితరులు నెల్లూరు ముంబై రహదారిపై ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నరసాపురం సమీపంలో ఆటోనగర్ ఏర్పాటుకు స్థల పరిశీలన గావించారు. ఆటో కార్మికులతో ఈ స్థలాన్ని పరిశీలించి ఇక్కడే ఆటోనగర్ కేటాయించేలా నిర్ధారించారు. ఈ ప్రతిపాదన గురించి మళ్ళీ తదుపరి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఈ అంశం మరుగున పడింది. 2017 లో ఈ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బొల్లినేని కృష్ణయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అధికారులతో ప్రతిపాద స్థలంలో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ కూడా నిర్వహించారు. చదును కూడా చేసి చిన్నపాటి పునాది నిర్మించే పరిస్థితి కలుగజేశారు. కానీ అనంతరం ఆటో నగర్ ఏర్పాటు గురించి అందరూ మరిచారు. ఆత్మకూరు పట్టణంలో బిఎస్ఆర్ సెంటర్ నుండి తిప్ప పైకి వెళ్లే ప్రాధాన్యత కలిగిన రహదారి అంచునే ఆటో దుకాణాలు రోడ్డు మీదనే వాహనాలు మరమ్మత్తులు అన్ని వర్గాలు ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆటోనగర్ ఏర్పాటు అయితేనే కార్మికులకు సౌకర్యంగా ఉంటుంది, జనాల అవస్థలు తొలుగుతాయి. మళ్లీ ఆత్మకూరు శాసనసభ్యులుగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి వచ్చినందున ఆయన చొరవ చూపిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం కాగలదని సర్వత్ర భావిస్తున్నారు.