గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు లోని శాఖ గ్రంధాలయం లో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఆధ్యాత్మిక గ్రంథాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, బాల సాహిత్యం, హెల్త్ బుక్స్, సాంఘిక నవలలు, జీవిత చరిత్రలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ప్రదర్శించబడినవి. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు డి.సురేష్ బాబు గారు, ఎం. జయరాములు హాజరైనారు. పుస్తక పఠనం వలన విషయ పరిజ్ఞానంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని తెలియజేశారు. అనంతరం ఇన్చార్జి లైబ్రేరియన్ ఓ.శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో సభ్యత్వాన్ని పొంది పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ ప్రదర్శనను విద్యార్థిని విద్యార్థులు, మరియు గ్రంథాలయ పాఠకులు ఆసక్తిగా తిలకించారు.