తెలుగుదేశం పార్టీలో చేరిన ములుమూడి చెందిన షేక్ సర్దార్, షేక్ కాలేషా మిత్రబృందం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ములుమూడి గ్రామానికి చెందిన షేక్ సర్దార్, షేక్ కాలేషా మరియు వారి మిత్రబృందం. వారికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... పదిమందికి మేలు చేసేవిధంగా, ప్రజలకు ఉపయోగపడేవిధంగా పని చేయండి. అందుకు స్థానిక శాసనసభ్యుడిగా నా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రం మొత్తం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.అందరం కలసికట్టుగా ఒక్కతాటిపై ఉండి, ప్రజలకు అందుబాటులో ఉందాం, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం అని తెలిపారు.నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతిఒక్కరికి అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మండల ఇంఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, టీడీపీ నాయకులు మీరా మొహిద్దీన్, రఫీ, మన్సూర్, నాయబ్, కరిముల్లా, మీర్జా, నాయబ్ తదితరులు పాల్గొన్నారు.