BREAKING
సుడిగాలి సుధీర్‌తో పెళ్లి పుకార్లపై అషు రెడ్డి స్పందన.. ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ వ్యాఖ్యలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సాల్వీడ్ విద్యార్థిని లావణ్య ఎంపిక అధికారులు..దళారుల కుమ్మక్కుతో బీమా అక్రమాలా? కంబదూరు ఎస్సైగా గోపి బాధ్యతలు స్వీకరణ. విశ్వహిందూ పరిషత్ విస్తరణకు విస్తృత కార్యాచరణ 60 ఏళ్ల అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపం దర్శనానికి శ్రీకారం.. పేదల నిరీక్షణకు తెరపడేనా...!? -- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాప్యం తండ్రులు పిల్లల బాధ్యతలు చూస్తే అంతగా పొగుడుతారెందుకు.. ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు అంబరాన్ని అంటిన బాలల దినోత్సవ వేడుకలు కార్తీక మాసం లో.. ఆదివరాహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి సింగరేణి ప్రభావిత నిరుద్యోగ యువతకు ఐటీ నైపుణ్య శిక్షణ మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం సిబ్బంది ఐదు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ఆత్మకూరు అభివృద్ధి లక్ష్యం - యువ నేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి రోడ్డుపైనే వాహనాల మరమ్మతులు - ఆటోనగర్ లేని అగచాట్లు

బాపట్ల జిల్లాలో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు – 150 నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు

Select Suryaa Now
బాపట్ల జిల్లాలో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు – 150 నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

బాపట్ల జిల్లాలో గ్రామపంచాయతీలకు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ వి గారు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గుర్తించి ఆమోదించారు.

మొదటి దశలో పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గ్రామపంచాయతీలకు 35 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, రెండవ దశలో వేమూరు మరియు చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామపంచాయతీలకు 58 కేంద్రాలు, మూడవ దశలో బాపట్ల మరియు రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామపంచాయతీలకు 57 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 150 నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మొదటి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం తొలి రోజున సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి 31 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయడానికి 56 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సంబంధిత నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో దాఖలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి టి. నగేష్ కుమారి గారు తెలిపారు.

నామినేషన్ల షెడ్యూల్ వివరాలు:

- 17-11-2026: నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.
- 18-11-2026: నామినేషన్ల పరిశీలన.
- 19-11-2026: తిరస్కరించబడిన నామినేషన్లపై అప్పీళ్ల పరిశీలన.
- 21-11-2026: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనున్న గ్రామపంచాయతీలకు 26-11-2026న పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి టి. నగేష్ కుమారి గారు వెల్లడించారు.