BREAKING
కళామతల్లి సేవలో శ్రీరామ నాట్యమండలి - 205 నాటక ప్రదర్శనలు ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తాం: మంత్రి నారాయణ సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్‌చెరు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామా! బాపట్ల జిల్లాలో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు – 150 నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు గిరిజన హక్కుల కోసం బీర్సా ముండా అలుపెరగని పోరాటం తెలుగుదేశం పార్టీలో చేరిన ములుమూడి చెందిన షేక్ సర్దార్, షేక్ కాలేషా మిత్రబృందం ప్రజల భద్రత మా ప్రాధాన్యత – మూగజీవుల సంక్షేమం మా బాధ్యత వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు

శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు

Select Suryaa Now
శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు

చీరాల, మేజర్‌న్యూస్‌ :

సమాజంలో పెరిగిపోతున్న మూఢనమ్మకాలను పారద్రోలుతూ శాస్త్రీయ దృక్పథంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు పిలుపునిచ్చారు. ఆదివారం చీరాల పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో బాపట్ల జిల్లా జనవిజ్ఞాన వేదిక మూడవ ప్లీనం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఎం.వి. చలపతిరావు జనవిజ్ఞాన వేదిక జెండాను ఆవిష్కరించి ప్లీనాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నేటి సమాజంలో మూఢనమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అన్ని రంగాలు కలుషితమవుతున్నాయని, ప్రైవేటీకరణ కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలపై జనవిజ్ఞాన వేదిక భవిష్యత్తులో విస్తృతంగా పనిచేస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థి దశ నుంచే చిన్నారుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు చెకుముకి పోటీలు నిర్వహించాలని సూచించారు. తద్వారా విద్యార్థులను మూఢనమ్మకాలకు దూరంగా ఉంచి, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చాలని అన్నారు.అనంతరం జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, నేటి సామాజిక పరిస్థితులపై ప్లీనంలో విస్తృతంగా చర్చించారు. సమావేశం చివరలో బాపట్ల జిల్లా జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గా కుర్రా రామారావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జె వి వి రాష్ట్ర కార్యదర్శి బి రవికుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే హుస్సేన్, అధ్యక్షులు బి హరిబాబు, పిచ్చియ్య,మాల్యాద్రి,కే శీను, సూరిబాబు,యుపీఎఫ్ నాయకులు సిహెచ్ బాపయ్య, మురళి, వై భాస్కర్ రావు , ముజీర్ కరిముల్ల,అంకిరెడ్డి శ్రీను ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసరావు,జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు, సభ్యులు పలువురు పాల్గొన్నారు.