ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు
కదిరి డిపో నందు వైద్యకారణాలపైన పదవీ విరమణ పొందిన డ్రైవర్ల సమస్యల పరిష్కా రానికి తోడ్పాటు అందించి, వారికి న్యాయంగా అందా ల్సిన బకాయిలు ఇప్పిస్తానని ఏపిఎస్ ఆర్టీసీలో "లా" ఆఫీ సర్ గా పనిచేసి, రిటైర్డు అయిన తలుపుల పూల రామచంద్ర,అడ్వకేట్ తెలిపారు. ఆదివారం అనంతపురంలో కదిరి డిపో రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు హరి మోహన్ కలసి, రిటైర్డు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రామ చంద్రకువివరించారు. ఈ సందర్బముగా రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బకా యిలు, కారుణ్య నియమకాలకు తన వంతు కృషి చేసి, న్యాయం చేస్తానని తెలిపారు. ఇప్పటివరకు సర్వీసులో వున్న వారికి లేబర్ కోర్టు ద్వారా ఎన్నో ఉత్తర్వులుఇప్పించి, న్యాయం చేసిన అడ్వకేట్ పూల రామచంద్ర ను కదిడిపో మాజీ ఉద్యోగులు హరి మోహన్, ముస్తఫా, క్రిష్టప్పలు పూల మాలలు వేసి దృశ్యాలువ కప్పి సన్మానించారు.