గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా అలుపెరగని పోరాటం
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. శ్రీనివాసరావు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :
భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ఆదివాసీ హక్కుల పోరాట వీరుడు మహానేత బిర్సా ముండా జయంతి వేడుకలను ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం. శ్రీనివాసరావు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ... బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, ఆదివాసీ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బిర్సా ముండా అని కొనియాడారు. తన ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
సీనియర్ అసిస్టెంట్ ఎం. అనిల్ కుమార్,
జూనియర్ అసిస్టెంట్లు డి. స్రవంతి,
జూనియర్ అసిస్టెంట్, పి. లోకేష్, ఎం. గోపి, పి. హిమసాగర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సతీష్, కోఆర్డినేటర్ బలరాముడు,
ఆఫీస్ డ్రైవర్ వై. మంజు, అటెండర్లు
బి. భాగ్యమ్మ, టి. కేశవయ్య,
నైట్ వాచ్మెన్ హెచ్. వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.