BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు

Select Suryaa Now
ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పంటలు సుభిక్షంగా పండాలని ఆకాంక్షిస్తూ ఆత్మకూరు రైతుల ఆధ్వర్యంలో ఆదివారం వరుణ యాగం, హోమం, బెల్లం పంపిణీ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.   ఆత్మకూరులోని సత్రం సమీపంలో ఉన్న అంకమ్మ మాను వద్ద హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి హనుమంతుని ఉత్సవ విగ్రహంతో డప్పు వాయిద్యాలు, భాజాభజంత్రీల నడుమ భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా సాగి ఆత్మకూరు చెరువు వద్దకు చేరుకుంది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, ఆమె తనయుడు, యువనేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చెరువు వద్ద ప్రత్యేక హోమం నిర్వహించి వరుణ దేవుడికి పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కాలువలు నీటితో కళకళలాడాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి పంటలు పుష్కలంగా పండాలని ప్రార్థించారు.
7 సంవత్సరాల క్రితం ఇదే విధంగా వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించామని, తిరిగి ఇప్పుడు సంప్రదాయబద్ధంగా వరుణ యాగం, హోమం నిర్వహిస్తున్నామని రైతులు తెలిపారు. వరుణ దేవుడి కరుణతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.