BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ

Select Suryaa Now
028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :    నెల్లూరులో ప్రభుత్వ విద్యారంగం రూపురేఖలు మారిపోతున్నాయి.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా మంత్రి నారాయణ వేగంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు పరమేశ్వరి నగర్‌లో వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను మంత్రి నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రికి టీడీపీ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే స్విమ్మింగ్ పూల్ వంటి అత్యాధునిక సదుపాయాలతో ఈ స్కూల్‌ను ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఇక 2028 చివరికల్లా నెల్లూరుని దేశంలోనే మోడల్ సిటీగా నిలబెడతామని మంత్రి నారాయణ తెలియజేశారు .. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా, విఆర్సీ స్ఫూర్తితో దాతల సహకారంతో ఆర్ఎస్ఆర్, డీఎస్ఆర్ హైస్కూల్స్‌ను అద్భుతంగా తీర్చిదిద్దామని, ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసి, తన కుమార్తె శరణికి ఆధునీకరణ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించానని తెలిపారు. వచ్చే 
విద్యాసంవత్సరంలో స్విమ్మింగ్ పూల్‌తో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభిస్తామని, కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌ను ఇదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని, తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ 2028 చివరికల్లా నెల్లూరుని దేశంలోనే మోడల్ సిటీగా నిలబెడతానని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, పేద పిల్లలకు విద్యను ఆస్తిగా ఇవ్వాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా, నారాయణ విద్యాసంస్థల కంటే మిన్నగా ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలను మంత్రి నారాయణ మార్చేస్తున్నారని, నెల్లూరు సిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతూ డిస్నీ వరల్డ్ తరహాలో ఎంటర్టైన్మెంట్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్-ఎలెక్ట్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు షేక్ షబానా బేగం, షేక్ కరీముల్లా, పఠాన్ ఎం.డి. జుబేర్ ఉద్దీన్ , షేక్ నజీమా, షేక్ షాహీనా, నాయకులు మైనుద్దీన్ భాయ్, జాఫర్ మరియు నౌషాద్, ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు