విజ్ఞాన దీపాలు... పుస్తకాలు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : విజ్ఞానాన్ని, వికాసాన్ని కలిగించే దీపాలు పుస్తకాలని జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం శాఖా గ్రంధాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలలో ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకతను రేకెత్తించి, ఆలోచనాత్మకంగా ఉండే కథలను అందించే పుస్తకాలను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా చదవాలన్నారు. పుస్తకాలు చదవటం ద్వారా వ్యక్తిత్వ వికాసము, నాయకత్వ లక్షణాలు, విలువలు పెంపొంది సమాజానికి ఉత్తమ పౌరులుగా దేశభక్తి, క్రమశిక్షణతో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలనాధికారి అల్లాడి నరసింహారావు, పాఠకులు ఎర్రయ్య,రాఘవరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.