మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్
సైదాపురం, మేజర్ న్యూస్ : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైదాపురం మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ తన మొక్కును తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాలినడకన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో స్వామివారికి చేసుకున్న మొక్కులో భాగంగా కాలినడకన క్షేత్రానికి చేరుకుని మొక్కు చెల్లించుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు సైతం ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఎన్నికల హడావుడి అనంతరం రాజకీయ కార్యక్రమాలకు కొంత విరామం ఇచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు రామ్ గోపాల్ రెడ్డి, సాంబయ్య, రమేష్,సైదాపురం నూతన ఎంపీటీసీ కుంచం సుబ్బయ్య ఇతరులు పాల్గొన్నారు