వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు.
కావలి, మేజర్ న్యూస్ : కావలి పట్టణ రాజకీయాల్లో వలసల పర్వం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా మూడో రోజు కూడా చేరికలు కొనసాగాయి. ఆదివారం పట్టణంలోని 34వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు సూరిశెట్టి రామకృష్ణ, ఆయన సతీమణి, 34వ వార్డు మాజీ కౌన్సిలర్ సూరిశెట్టి సుభాషిణి దంపతులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
కావలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన సూరిశెట్టి రామకృష్ణ, సుభాషిణి దంపతులకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా పార్టీ కండువాలు కప్పి, సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
మరిన్ని చేరికలు ఉండే అవకాశం:
వరుసగా మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, ప్రజాప్రతినిధులు వైసీపీ బాట పట్టడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో టీడీపీ నుండి వైఎస్సార్‌సీపీలోకి మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉందని పార్టీ నాయకులతో పాటు స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ నాయకులు, 34వ వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.