పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు
వింజమూరు, మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఆదివారం ప్రారంభమైంది వింజమూరు లో ఆదివారం మొదటి రోజున 5 సర్పంచి 16 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు అయినట్లు ఎంపీడీవో కే శ్రీనివాసరెడ్డి తెలిపారు నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న మూడు రోజులు పాటు శాంతి భద్రతల విషయంలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ ను విధించారు వింజమూరు పంచాయతీ 20 వార్డులు ఉండగా ఇప్పటివరకు ఐదు సర్పంచ్ 16 వార్డు సభ్యుల నామినేషన్ దాఖలు దాఖలయ్యాయి సోమవారం శుభసమయం అయినందున నామినేషన్ చేసే అవకాశం ఉందని ఎన్నికల నిర్వహణ అధికారి తెలిపారు