BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు

Select Suryaa Now
గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..?  మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు

మర్రిపాడు, మేజర్ న్యూస్ :   మర్రిపాడు మండలంలో గ్రామీణ రహదారులు అధ్వాన్నంగా మారాయి. దీంతో ప్రయాణికులు, వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో ఏ పల్లెకు వెళదామన్న మోకాల్లోతు గుంతలతో రహదారులు దర్శనమిస్తున్నాయి. రహదారులు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్యాచ్ పనులు కూడా చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన తుఫానుల కారణంగా రహదారులు మరింతగా దెబ్బతిని దర్శనమిస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ రహదారులకు మోక్షం ఎప్పుడోనని పలువురు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
                   మర్రిపాడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అద్వాన్నంగా తయారై దర్శనమిస్తుండడంతో అటు వాహన చోదకులకు ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా ప్రమాదాలు కూడా సంభవిస్తుండడంతో రహదారుల్లో ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు. గత ఐదేళ్ల నుంచి ఆ రహదారులకు కనీసం మరమ్మతులు కూడా చేసిన పాపాన పోకపోవడంతో మోకాల్లోతు  గుంతలతో దర్శనమిస్తున్నాయి. మర్రిపాడు మండలంలో ప్రధానంగా సింగనపల్లి, కంపసముద్రం, పెగళ్లపాడు పల్లవోలు, వెంకటాపురం, మర్రిపాడు నుండి చిలకపాడు మీదుగా ఉదయగిరికి వెళ్లే రహదారితో పాటు పడమటి నాయుడుపల్లి, ఇర్లపాడు, భీమవరం, తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు మరింత దారుణంగా తయారయ్యాయి. గత పది ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రహదారులు నేడు గుంతలమయంతో దర్శనం ఇస్తున్నాయి. నిర్మించిన నాటి నుంచి నేటికీ ఆ రహదారులు వైపు కన్నెత్తిన చూసిన నాథుడే లేడు. దీంతో మరమ్మత్తులు కూడా నోచుకోలేదు. ఫలితంగా ప్రయాణికులు వాహన చోదకులు నానా అవస్థలు పడుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రహదారుల్లో బస్సు సౌకర్యం పెద్దగా లేనందున ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు ఎక్కువగా నడుస్తుంటాయి. దీంతో ఏ గుంతలో ఏ టైరు పడి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళన చెందుతూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో సీసీ రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ప్రధాన రహదారులను మరిచారు. దీంతో ప్రయాణం నరకయాతన అయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు పట్టించుకోని రహదారులకు మరమ్మత్తులు చేయించడం గానీ లేక నూతన రహదారులు నిర్మించడం కానీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.