andhrapradesh
పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి
Andhrapradesh
15 Nov 2026
36 views
పుస్తక పఠనంను అలవర్చుకోవాలి
- జిల్లా గ్రంధాలయ వారోత్సవాలలో అతిథులు పిలుపు
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : విద్యార్థులు, యువత సెల్ ఫోన్ ను వాడకానికి బానిస కాకుండా .. పుస్తక పఠనంను అలవర్చుకోవాలని విశిష్ట అతిథులు పిలుపునిచ్చారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం రెండవ రోజు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ అధ్యక్షతన కొనసాగాయి. వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విశిష్ట అతిథిగా శ్రీపతికి రమేష్ నారాయణ , అనంత రక్తదానం అధినేత తరిమెల అమర్నాథ్ రెడ్డి హాజరై పుస్తక పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ మాట్లాడుతూ గ్రంధాలయాలలో విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని, వికాసాన్ని, ప్రభుత్వ ఉద్యోగాలను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ నారాయణ మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం గ్రంధాలయాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని, వాటిని యువకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.సెల్ ప్రభావానికి లోను కాకుండా పుస్తక పఠనం పై శ్రద్ద వహించాలని కోరారు.తరిమెల అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజం లో అన్ని వయసుల వారిలోనూ పుస్తక పతనం పై శ్రద్ద తగ్గి పోతోందని కేవలం సెల్లోనే అన్ని లభిస్తాయని అనుకోవడం మంచిది కాదని సెల్ ఎంత ఊయోగపడినా పుస్తకం విలువ పుస్తకానిదేనని తెలిపారు. తల్లితండ్రులు ప్రతి ఒక్కరు తమ పిల్లలకు పుస్తక పఠనము పై శ్రద్ద వహించేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కవులు కళాభూషణ్ డాక్టర్ అంకె రామలింగామయ్య, జూటూరు షరీఫ్, రియాజుద్దీన్ మధురశ్రీ పాల్గొన్నారు. డిప్యూటీ గ్రంధాలయాధికారి పి కమ్మన్న, సహా గ్రంధాలయాధికారి డి గోవిందు కార్యాలయ సిబ్బంది,ముత్యాలమ్మ, ఇందిరమ్మ,శిరీషా, సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Breaking News