BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ

Select Suryaa Now
అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ

నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్  :    నెల్లూరు వేదాయపాలెం స్వామి అయ్యప్ప దేవస్థానంలో వేదశాస్త్ర అయ్యప్ప స్వామి 40వ వార్షిక కేరళ సంప్రదాయ మండల పూజలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం అధ్యక్షులు గూడల శేషగిరిరావు తెలిపారు. ఆదివారం దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, సభ్యులు పావళ్ళ ప్రసాద్, పసుపులేటి అశోక్ చంద్ర కలిసి మండల పూజల కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం గూడల శేషగిరిరావు మాట్లాడుతూ ఈరోజు ఉదయం నూతన ఉత్సవ పంచలోహ విగ్రహ ప్రాణప్రతిష్ఠ, శతకలశాభిషేకం నిర్వహిస్తామని చెప్పారు.ఈ రోజు సాయంత్రం మండల పూజల కొడియెట్టం (ధ్వజారోహణం), తదుపరి తొలి పడిపూజ జరగనున్నాయని వెల్లడించారు.
నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు అయ్యప్ప స్వామికి కేరళ సంప్రదాయ త్రికాల పూజలు, వేలి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 28వ తేదీన నగరోత్సవం, డిసెంబర్ 29వ తేదీన ఆరాట్టు (అయ్యప్ప స్వామికి కోనేటి స్నానం) కార్యక్రమాలతో మండల పూజలు ముగుస్తాయని వివరించారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు, భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం జరుగుతాయని పేర్కొన్నారు. మండల పూజలు, అన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతోనే జరుగుతున్నాయని, భక్తులు పాల్గొని స్వామి కృప పొందాలని ఆయన కోరారు.