BREAKING
మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్ కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్... కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.... ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు జైలర్ 2 నుంచి 'బిందాస్' ఫుల్ వీడియో సాంగ్ విడుదల.. రజినీకాంత్, నోరా ఫతేహి జోరు

సీనియర్ జర్నలిస్ట్ "సోమా"కు జాతీయ పురస్కారం

Select Suryaa Now
సీనియర్ జర్నలిస్ట్ "సోమా"కు జాతీయ పురస్కారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, ఏ పి యూ డబ్ల్యూ జె జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ సోమా వెంకటసుబ్బయ్యకు ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారం లభించింది. ఆదివారం కోట మండలం విద్యానగర్ లో ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల జాతీయ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా వెంకటసుబ్బయ్యను ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. ఎం.వి రావు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం.లీలా మోహనకృష్ణ ఆధ్వర్యంలో అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో కోట మండల విద్యాశాఖ అధికారి మస్తానయ్య, ఎన్.బి.కె.ఆర్ కాలేజ్ డైరెక్టర్ విజయకుమార్, ప్రముఖ విద్యాసంస్థల డైరెక్టర్ ఉషారాణి, సినీ కళాకారులు జబర్దస్త్ కళాకారులైన నవ్వుల మాస్టర్ దామోదర్, మరియు శ్రీనివాస్, పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా తాము వివిధ వర్గాలకు చెందిన ప్రతిభ గల వారిని గుర్తించి పురస్కారాలు అందజేస్తుంటామని ఎంవి రావు ఫౌండేషన్ అధ్యక్షుడు ఎం లీల మోహన్ కృష్ణ తెలిపారు. తనను గుర్తించి జాతీయ గౌరవ పురస్కారం అందజేసిన ఎన్విరావ్ ఫౌండేషన్ అధ్యక్షులు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి లకు వెంకటసుబ్బయ్య ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఉపాధ్యాయులు,వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యాసంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.