BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్...

Select Suryaa Now
కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్...

​కావలి, మేజర్ న్యూస్ :    కావలి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పట్టణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రైతు సంఘం నేత బొట్లగుంట శ్రీహరి నాయుడు ఆదివారం మున్సిపల్ చైర్మన్ పదవికి రెబల్ (స్వతంత్ర) అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు కూడా చైర్‌పర్సన్ పదవి కోసం నామినేషన్లు వేశారు.  
​పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలక పాత్ర:  
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి పార్టీలో కొనసాగుతూ, సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్న బొట్లగుంట శ్రీహరి నాయుడుకు ముసునూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైన పట్టు ఉందని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. రైతు సంఘం నాయకుడిగా కూడా ఆయనకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది.
​కూటమి అంచనాలపై ప్రభావం ఉంటుందా...?:
బొట్లగుంట శ్రీహరి నాయుడు స్వతంత్ర చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం కావలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన నామినేషన్ ఉపసంహరించుకోకుండా చివరి వరకు బరిలో నిలిస్తే, తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ఓట్లపై కొంత మేర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
​నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి పార్టీ అధిష్ఠానం బుజ్జగింపులు ఫలిస్తాయా లేక శ్రీహరి నాయుడు పోటీలోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాలి.