BREAKING
వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్ కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్... కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.... ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు జైలర్ 2 నుంచి 'బిందాస్' ఫుల్ వీడియో సాంగ్ విడుదల.. రజినీకాంత్, నోరా ఫతేహి జోరు పుట్టినరోజు పేదల సేవకు ఆర్భాటాలకు దూరం ఉచిత మెగా వైద్య శిబిరం. సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు సీనియర్ జర్నలిస్ట్ "సోమా"కు జాతీయ పురస్కారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యా విజయానికి బలమైన పునాది నాన్నగారి బయోపిక్ తీస్తానంటే నిర్మాతగా ఉంటా కానీ అందులో నటించలేను.. మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన

గురుకులంలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం...

Select Suryaa Now
గురుకులంలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం...

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇనగంటి అఖిల్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.వివరాల్లోకి వెళ్తే, గురుకులంలో అఖిల్ బైపీసీ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం నుండి గురుకులంలో కనబడటం లేదు. దీంతో తోటి విద్యార్థులు, సిబ్బంది ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది.అయితే బుధవారం మిస్సయిన విద్యార్థి గురించి ప్రిన్సిపల్ ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం. బుధవారం నుండి ఆదివారం వరకు ఫిర్యాదు చేయకపోవడంపై ప్రిన్సిపల్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ సింహ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

సూర్య మేజర్ న్యూస్/ అన్నపురెడ్డిపల్లి..