BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

ఉచిత మెగా వైద్య శిబిరం. సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు

Select Suryaa Now
ఉచిత మెగా వైద్య శిబిరం. సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు

వింజమూరు, మేజర్ న్యూస్  :   గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వింజమూరు పట్టణంలోని వివేకానంద స్కూల్ ప్రాంగణంలో ఆదివారం న్యూరాలజీకి సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరులోని లోటస్‌ హాస్పిటల్‌లో న్యూరాలజీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రశాంతి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే నిపుణులైన వైద్య సేవలను పొందేలా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్‌ ప్రశాంతి తెలిపారు. శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలపై తగిన సూచనలు, సలహాలు అందించారు.ప్రత్యేకంగా గుండె సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ రాజేంద్రరెడ్డి కూడా శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ పక్షవాతం, తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్, నరాల సంబంధిత సమస్యలు తదితర వ్యాధులకు నిపుణుల వైద్య సలహాలు, అవసరమైన పరీక్షలు అందిస్తున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకోవడం మంచిదన్నారు ఈ కార్యక్రమంలో మస్తాన్ వైద్యశాల సిబ్బంది తదితరులు హాజరయ్యారు.