BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

పుట్టినరోజు పేదల సేవకు ఆర్భాటాలకు దూరం

Select Suryaa Now
పుట్టినరోజు పేదల సేవకు ఆర్భాటాలకు దూరం

వింజమూరు, మేజర్ న్యూస్  :   జన్మదిన వేడుకలంటే కేకులు, ఆర్భాటాలు కావని, పేదలకు సాయం చేయడమే నిజమైన వేడుక అని చాటి చెప్పారు వింజమూరు ఎంపీడీవో కే. శ్రీనివాసరెడ్డి,హరిణి దంపతులు.
తన కుమారుడు  గౌతం విహాన్ రెడ్డి  జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారంవింజమూరులోని జై భీమ్ నగర్ కాలనీలో నివాసముండే ఒక నిరుపేద కుటుంబానికి అవసరమైన బియ్యంతో పాటు రూ.10,000 నగదును అందజేశారు. ఆ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  ప్రతి సంవత్సరం కుమారుడి జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడి వృద్ధులను కలిసి, వారి అవసరాలు తెలుసుకుని అవసరమైన సామగ్రిని అందజేయడం తమ కుటుంబ ఆనవాయితీగా మారిందని శ్రీనివాసలురెడ్డి తెలిపారు.ఈసారికాలనీలోని పేద కుటుంబాన్ని ఎంపిక చేసి సాయంఅందించామని చెప్పారు.ఈ సందర్భంగా ఆయన దంపతులు మాట్లాడుతూ, పదిమందికి సేవచేయాలనేసంకల్పంతోనేమాకుమారుడిజన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఆర్భాటవేడుకలునిర్వహించకుండా పేదలకు మా వంతుసహాయసహకారాలు అందించడంలోనే మాకు నిజమైన తృప్తి, సంతోషం కలుగుతుంది.మాకుమారుడికి కూడా చిన్నతనం నుంచే సేవా గుణాన్ని అలవాటు చేయాలని ఈ కార్యక్రమాలుచేస్తున్నాంఅని అన్నారు.అధికారిగా తన బాధ్యతలతో పాటు, మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల స్థానికులు, సిబ్బంది ఎంపీడీవో దంపతులను అభినందించారు.