BREAKING
వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్ కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్... కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.... ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు జైలర్ 2 నుంచి 'బిందాస్' ఫుల్ వీడియో సాంగ్ విడుదల.. రజినీకాంత్, నోరా ఫతేహి జోరు పుట్టినరోజు పేదల సేవకు ఆర్భాటాలకు దూరం ఉచిత మెగా వైద్య శిబిరం. సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు సీనియర్ జర్నలిస్ట్ "సోమా"కు జాతీయ పురస్కారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యా విజయానికి బలమైన పునాది నాన్నగారి బయోపిక్ తీస్తానంటే నిర్మాతగా ఉంటా కానీ అందులో నటించలేను.. మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన

ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యా విజయానికి బలమైన పునాది

Select Suryaa Now
ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యా విజయానికి బలమైన పునాది

వింజమూరు, మేజర్ న్యూస్ :    నేటి విద్యారంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుడు బాధ్యతలు కూడా విస్తరిస్తున్నాయి ఒకప్పుడు ఉపాధ్యాయుడు ప్రధాన బాధ్యత పాఠ్యాంశాలను సమర్థవంతంగా బోధించడం మాత్రమే అనుకునేవారు కానీ ప్రస్తుతం విద్యార్ధికి విషయ పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు అతని ఆలోచన విధానం భావోద్వేగ పరిపక్వత సామాజిక నైపుణ్యత నైతిక విలువలు ఆత్మవిశ్వాసం వంటి అంశాలను కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడి పైనే ఉందని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ముంతా కోటేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యావ్యవస్థలో ఒక ముఖ్యమైన అంశంగా మారింది వ్యక్తిత్వం వికాసం అంటే కేవలం మాట్లాడే తీరు దుస్తులు లేదా ప్రవర్తన మాత్రమే కాకుండా స్వీయ అవగాహన భావోద్వేగా నియంత్రణ సహనం సానుభూతి నైతిక ప్రవర్తన ఆత్మవిశ్వాసం సమర్థవంతమైన సంభాషణ సామాజిక నైపుణ్యాలు వృత్తి పట్ల నిబద్ధత వంటి అనేక లక్షణాల సమన్వయమే ఉపాధ్యాయుడు వ్యక్తిత్వ వికాసం అని తెలిపారు 
బోధనలో వ్యక్తిత్వం ఎందుకు కీలకము 
ఉపాధ్యాయుడు వ్యక్తిత్వం తరగతి గది వాతావరణం నేరుగా ప్రభావితం చేస్తుంది కర్తవ్యం నిష్ట కలిగిన ఉపాధ్యాయుడు బోధనను క్రమబద్ధంగా నిర్వహిస్తాడు భావోద్వేగంగా స్థిరంగా ఉండే ఉపాధ్యాయుడు ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొని బోధనలో నాణ్యతను కొనసాగిస్తాడు విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఆప్యాయంగా మెలిగే ఉపాధ్యాయుడు వారి భాగస్వామ్యాన్ని ఆసక్తిని పెంచగల డని తెలిపారు అదే విధంగా ఉపాధ్యాయుని సానుభూతి నిజాయితీ సహనం సహకార భావం విద్యార్థుల సామాజిక మరియు భావోద్వేక వికాసం పై గణనీయమైన ప్రభావం చూపుతుందన్నారు విద్యార్థులు ఉపాధ్యాయుడిని కేవలం పాఠాలు చెప్పే వ్యక్తిగా కాకుండా ఒక ఆదర్శంగా కూడా భావిస్తారు అందువల్ల ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించాలనుకునే విలువలను ముందుగా తన ప్రవర్తనలో ప్రతిబింబించాలని తెలిపారు 
వ్యక్తిత్వం ద్వారా విలువల వికాసం 
ఇండోనేషియాలోని పేమాటాంగ్ నందుగల ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మరో గుణాత్మక అధ్యయనం ఉపాధ్యాయుల వ్యక్తిత్వం నైపుణ్యాలు విద్యార్థుల నైతిక వికాసం పై చూపి ప్రభావాన్ని పరిశీలించండి తరగతి గది పరిశీలనలు ఉపాధ్యాయులతో ఇంటర్వ్యూలు విద్యార్థులతో నిర్వహించి వచ్చిన ద్వారా సమాచారాన్ని సేకరించగా భావోద్వేగా పరిపక్వత సానుభూతి సమగ్ర దృక్పథం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులలో వికాసం ఆత్మ పరిశీలనా పరస్పర గౌరవం నైతిక విలువలను పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించిందని తెలిపారు దీని ద్వారా ఉపాధ్యాయుడు వ్యక్తిత్వం వికాసం కేవలం విద్యార్థుల విద్యా ఫలితాలను పరిమితం కాదని విద్యార్థుల వ్యక్తిత్వం నిర్మాణం నైతిక విలువలు సామాజిక బాధ్యత భావోద్వేగా వికాసం వంటి విస్తృతమైన అంశాలపై కూడా అది ప్రభావం చూపుతుందన్నారు 
ఉపాధ్యాయుడే విద్యార్థికి ఆదర్శం 
విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే మాటలను మాత్రమే కాకుండా వారి ప్రవర్తనను కూడా గమనిస్తారు సమయపాలన గురించి బోధించే ఉపాధ్యాయుడు స్వయంగా సమయపాలన పాటించినప్పుడు ఆ విలువ విద్యార్థిపై మరింత ప్రభావం చూపుతుంది అదేవిధంగా నిజాయితీ క్రమశిక్షణ సహనం పరస్పర గౌరవం బాధ్యత వంటి విలువలను ఉపాధ్యాయుడు తన ఆచరణ ద్వారా చూపించినప్పుడు విద్యార్థులు వాటిని సులభంగా స్వీకరిస్తారు 
ఉపాధ్యాయుడు ఒక విజయవంతమైన పాఠ్యపుస్తకం 
ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలో విషయ పరిజ్ఞానం బోధనా పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాము వ్యక్తిత్వ వికాసాన్ని కూడా అంతే ప్రాధాన్య ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు స్వీయ పరిశీలన భావోద్వేగ నైపుణ్యాలు ఒత్తిడి నిర్వహణ సానుభూతి నైతిక విలువలు సంభాషణ నైపుణ్యాల వంటి అంశాలపై ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అందించాలి ఎలాంటి శిక్షణ వృత్తిపరమైన ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య సానుకూల సంబంధాలను బలోపేతం చేస్తాయని తెలిపారు 
వ్యక్తిత్వ వికాసం నిరంతర ప్రక్రియ 
వ్యక్తిత్వ వికాసం ఒకసారి శిక్షణ తీసుకుంటే పూర్తయ్యే ప్రక్రియ కాదు అది ఉపాధ్యాయ నిరంతర అభ్యాసం ఆత్మ పరిశీలన అనుభవాల ద్వారా అభివృద్ధి చెందే ప్రక్రియ తరగతి గదిలో ఎదురయ్యే ప్రతి అనుభవం తనను తాను మెరుగుపరుచుకునే ఒక అవకాశం గా మార్చుకోవాలి 
విద్య నాణ్యతకు పునాది 
విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడానికి పాఠ్య పుస్తకాలు సాంకేతిక పరిజ్ఞానం మౌలిక వసతులు ఎంత అవసరమో సమర్థవంతమైన ఉపాధ్యాయుడు కూడా అంతే వ్యక్తిత్వ వికాసం ఇక్కడ కీలకపాత్ర వహిస్తుంది. కావున శిక్షణ సంస్థలు పాఠశాలన నాయకత్వం విద్యావిధానం రూపకర్తలు వ్యక్తిత్వ వికాసాన్ని ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు 
ముగింపు 
ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం ఒక అదనపు నైపుణ్యం కాదు అది సమర్థవంతమైన విద్యా వ్యవస్థకు పునాది లాంటిదని ఉపాధ్యాయుడు తన వ్యక్తిత్వం ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా జీవన విలువలను కూడా అందిస్తాడు కావున ఏమి బోధిస్తారని దానికే కాకుండా ఎలా బోధిస్తారు విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తారు అనే అంశాలను నిర్దేశిస్తుంది 
      మంచి ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు గొప్ప ఉపాధ్యాయుడు తన వ్యక్తిత్వంలో ఒక తరాన్ని తీర్చి దిద్దుతాడు.