BREAKING
గ్రంథాలయాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో ఎంపీ చామల తెలంగాణలో జపాన్ పెట్టుబడులు, స్వగ్రామం రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రి చివరి కోరిక నెరవేర్చిన కుమారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర వైసీపీదే. జడ్పిటిసి శివరుద్రప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా ఘన సన్మానం సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం

ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెరపై ఎప్పుడూ స్టైలిష్ లుక్, ఆకట్టుకునే ఫిట్‌నెస్‌తో మెప్పించే ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తన ఆరోగ్య రహస్యాలు, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత భావోద్వేగాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆకాశంలో ఒక తార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దుల్కర్, తన ఫిట్‌నెస్ మంత్రాన్ని వివరించారు. షూటింగ్ ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ వ్యాయామానికి తప్పనిసరిగా సమయం కేటాయిస్తానని, కార్డియో, వెయిట్ ట్రైనింగ్ తన దినచర్యలో భాగమని తెలిపారు. ముఖ్యంగా లెగ్ వర్కవుట్స్‌తో పాటు అప్పర్ బాడీ కండరాలను టోన్ చేసుకునే వ్యాయామాలపై దృష్టి పెడతానని, తాను నటించే పాత్రలకు తగినట్లుగా ఫిట్‌నెస్ లక్ష్యాలను మార్చుకుంటానని స్పష్టం చేశారు.

శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అంతే ముఖ్యమని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ చేస్తానని చెప్పారు. నిద్ర లోపం వల్ల కూడా ఒత్తిడి కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతానని వివరించారు. మగవారు ఏడవకూడదనే భావనను తాను వ్యతిరేకిస్తానని, ఏడవడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గి యంగ్‌గా కనిపిస్తామని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. తాను చాలా సున్నిత మనస్కుడినని, తాను నిర్మించిన ఒక సినిమా పరాజయం పాలైనప్పుడు అలాగే తన కూతురు జన్మించినప్పుడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ తన రోజు కప్పు కాఫీతో మొదలవుతుందని, అల్పాహారంలో ఇడ్లీ, అవకాడో, గుడ్లు తీసుకుంటానని దుల్కర్ తెలిపారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు సమతూకంగా ఉండేలా చూసుకుంటానని, వ్యాయామానికి ముందు అరటిపండు తిని, అనంతరం ప్రొటీన్ షేక్ తాగుతానని చెప్పారు. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకుంటానని పేర్కొన్నారు.

వారంలో ఒకటి లేదా రెండు రోజులు చీట్ డైట్ పాటిస్తూ తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తానని దుల్కర్ సల్మాన్ వెల్లడించారు. బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని, అమ్మ చేసే తలశ్శేరి బిర్యానీ, ఫిష్ బిర్యానీ తింటుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుందని చెప్పారు. మలయాళ వంటకాలైన పత్రిపై కొబ్బరిపాలు పోసుకుని చికెన్, మటన్ కర్రీతో తినడం తనకు ఇష్టమని తెలిపారు. 2020 లాక్‌డౌన్ సమయంలో జిమ్‌లు మూతపడినప్పుడు ఇంట్లోనే వ్యాయామం చేయాలనే సందేశంతో ట్రైనింగ్ డన్ ఛాలెంజ్ ప్రారంభించి, రానా, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరీ వంటి సహనటులను ఆహ్వానించిన విషయాన్ని దుల్కర్ గుర్తు చేసుకున్నారు.