BREAKING
స్వగ్రామం రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రి చివరి కోరిక నెరవేర్చిన కుమారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర వైసీపీదే. జడ్పిటిసి శివరుద్రప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా ఘన సన్మానం సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు!

విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ

Select Suryaa Now
విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ నటి రమ్యకృష్ణ, టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీల దాంపత్య జీవితంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న విడాకుల పుకార్లకు స్వయంగా రమ్యకృష్ణ తెరదించారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుండటంతో సోషల్ మీడియాలో రకరకాల వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంపై స్పష్టతనిచ్చారు. తాము విడాకులు తీసుకోలేదని, ఇప్పటికీ దంపతులుగానే ఉన్నామని రమ్యకృష్ణ స్పష్టం చేశారు.  


కెరీర్ పరమైన అవసరాలు, కుటుంబ సౌలభ్యం దృష్ట్యానే తాము వేర్వేరుగా ఉంటున్నామని రమ్యకృష్ణ వివరించారు. 2003లో వివాహం చేసుకున్న తర్వాత తమ కుమారుడు పుట్టిన సమయంలో తాను సీరియల్స్‌తో బిజీగా ఉండేదానినని, ప్రతి పదిహేను రోజులకోసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. అలా వచ్చి వెళ్లిన ప్రతిసారీ కుమారుడు అనారోగ్యానికి గురయ్యేవాడని, దీంతో అబ్బాయిని చెన్నైలోనే చదివిస్తే బాగుంటుందని కృష్ణవంశీతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుండగా, కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటూ తన సినిమాల పనుల్లో నిమగ్నమయ్యారు.  

రోజూ అనవసరమైన గొడవలు పడటం కంటే, పరస్పర గౌరవంతో మంచి స్నేహితులుగా ఉండటమే తమ బంధాన్ని నిలబెడుతోందని రమ్యకృష్ణ పేర్కొన్నారు. కృష్ణవంశీకి సినిమానే ప్రపంచమని, ఆయన తన వృత్తిలో జోక్యం చేసుకోరని, తాను కూడా ఆయన పని విషయాల్లో తలదూర్చనని చెప్పారు. గతంలో పెళ్లి ఎందుకు, లివింగ్ టుగెదర్‌గా ఉందామని కృష్ణవంశీ అడిగిన మాటలను సరదాగా గుర్తు చేసుకుంటూ, తమ మధ్య బంధం ఎంతో సంతోషంగా, పటిష్టంగా ఉందని తేల్చిచెప్పారు.  

తన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా పంచుకోవడానికి తాను పెద్దగా ఇష్టపడనని, వృత్తిపరమైన అంశాలకే ప్రాధాన్యత ఇస్తానని రమ్యకృష్ణ వెల్లడించారు. పరస్పర అవగాహనతో వేర్వేరు చోట్ల ఉన్నప్పటికీ, భార్యాభర్తలుగా తమ అనుబంధంలో ఎలాంటి లోటు లేదని ఆమె స్పష్టం చేయడంతో అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు ఫుల్‌స్టాప్ పడింది.