అయ్యప్ప స్వామి సేవలో శాపురం నర్సింహారెడ్డి -పాటి గ్రామంలో ప్రత్యేక పూజలు..
పటాన్చెరు, ; పాటి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో ముత్తంగి డివిజన్–265 సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శాపురం నర్సింహారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా శాపురం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని,ప్రతి కుటుంబంలో ఆనందం, ప్రశాంతత వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించారు.భక్తి,ఆధ్యాత్మిక భావనలతో సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు.