కొత్తూరు డి గ్రామంలో ఘనంగా నవగ్రహ ప్రతిష్ఠాపన, ఆంజనేయస్వామి వార్షికోత్సవ వేడుకలు
కోహిర్, ; కోహిర్ మండల పరిధిలోని కొత్తూరు డి గ్రామంలో నవగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం, శ్రీ ఆంజనేయస్వామి వారి వార్షికోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పవిత్ర కార్యక్రమంలో వీరశైవ జంగమ మహేశ్వరులైన భద్రయ్య స్వామి, శ్రీశైలం స్వామి, పవన్ స్వామి, శ్రవణ్ స్వామి, వికాస్ స్వామి, రంజిత్ స్వామి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నవగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిపూర్వకంగా సాగింది.నవగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ఆంజనేయస్వామి వారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాణిక్ ప్రభు పాటిల్, ఉపసర్పంచ్ మ్యాటర్ ఆనంద్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారం, భక్తుల భాగస్వామ్యంతో వేడుకలు విజయవంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరియగా, నవగ్రహ ప్రతిష్ఠాపన మరియు ఆంజనేయస్వామి వార్షికోత్సవ వేడుకలు గ్రామ ప్రజల్లో నూతన ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.