పీచేరేర్యాగడి కొత్త తండాలో వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల అధ్యక్షులు మల్లన్న పాటిల్
కోహిర్, కోహిర్ మండల కేంద్రంలోని పీచేర్యాగడి
కొత్త తండాలో నిర్వహించిన వివాహ వేడుకల్లో కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లన్న పాటిల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.వధూవరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్, సతీష్ కుమార్, లక్ష్మణ్ చౌహాన్, చౌహాన్ మేఘనాథ్ నాయక్, రయావత్ భీమభాయ్ వినోద్ కుమార్, చందర్ (ఉపసర్పంచ్), సిహెచ్. రాము, సిహెచ్. మోహన్, సిహెచ్. లస్కర్ (సొసైటీ డైరెక్టర్), సిహెచ్. ప్రకాష్, వాగుల శేఖర్ (మెంబర్), గడ్డం చిన్ని (ఉపసర్పంచ్), చిరంజీవి (మెంబర్), గడ్డం అనిల్, ఫక్రొద్దీన్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.