BREAKING
రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు! ప్రజాసేవ కోసం ఒక్కసారి అవకాశం కల్పించండి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా 'మణిమ' సినిమా ప్రారంభం.. పూరీ జగన్నాథ్ నేపథ్యంలో మైథాలజికల్ థ్రిల్లర్

Select Suryaa Now
భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా 'మణిమ' సినిమా ప్రారంభం.. పూరీ జగన్నాథ్ నేపథ్యంలో మైథాలజికల్ థ్రిల్లర్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: శ్రీ ఫిల్మ్స్ & ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రం మణిమ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ నలమాస దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అమరేష్ చంద్ర సారంగి నిర్మిస్తున్నారు. ఇందులో పృథ్వీ సాయి దండమూడి, జీషు సేన్ గుప్తా, కబీర్ దుహన్ సింగ్, బాబీ మిశ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తారాగణంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. నిర్మాత అమరేష్ చంద్ర సారంగి చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.

చిత్ర దర్శకుడు నవీన్ నలమాస మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ స్వామి నేపథ్యంలో మైథాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 16 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఇక్కడ రెండు షెడ్యూళ్లు, ఒడిశాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసి వచ్చే ఏడాది జూలైలో జరిగే పూరీ జగన్నాథ్ రథయాత్ర సమయానికి సినిమాను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ చిత్రంలో సుమారు 30 శాతం వరకు వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉంటాయని పేర్కొన్నారు.

నిర్మాత అమరేష్ చంద్ర సారంగి మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ స్వామిపై ఉన్న భక్తితో, ఆ సెంటిమెంట్‌తోనే తెలుగులో తన తొలి నిర్మాణ చిత్రాన్ని ప్రారంభించానని చెప్పారు. గతంలో ఒడియాలో ఒక సినిమా నిర్మించానని, ఇప్పుడు తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ భాషల్లో మణిమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఉన్నత సాంకేతిక విలువలతో, గ్రాండ్ విజువల్స్‌తో సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి తెలిపారు. ఐఐటీ కృష్ణమూర్తి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చానని, మంచి కథ కోసం ఎదురుచూస్తుండగా ఈ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే అంగీకరించానని హీరో పృథ్వీ సాయి దండమూడి పేర్కొన్నారు.