ఇంకొల్లు మండలంలో తొలిరోజు ఆరు నామినేషన్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండంలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఆరు నామినేషన్లు అందినట్లు ఇంకొల్లు మండల అభివృద్ధి అధికారి గట్టా శ్రీనివాసరావు తెలిపారు. పావులూరు సర్పంచ్ అభ్యర్థిగా గుంజి రేణుకమ్మ, కొణికి సర్పంచ్ అభ్యర్థులుగా పావులూరి ఎలియాజరు, కట్టా రమేష్, పావులూరు వార్డు సభ్యులుగా వలేరు జేమ్స్, నిదానపు సుబ్బారావు, వలేరు అంజమ్మలు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఇంకొల్లు మండలంలో నామినేషన్లకు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పావులూరు సచివాలయం పరిధిలో పావులూరు, నక్కలపాలెం, నాగండ్ల, సూదివారిపాలెం గ్రామాలు, ఇంకొల్లు సచివాలయం -1 పరిధిలో ఇంకొల్లు సర్పంచ్, 20 వార్డులు, ఇంకొల్లు సచివాలయం-2 పరిధిలో భీమవరం, గంగవరం, కొణికి సచివాలయం పరిధిలో కొణికి, దుద్దుకూరు, ఇడుపులపాడు సచివాలయం పరిధిలో ఇడుపులపాడు, వంకాయలపాడు, సుబ్బారెడ్డిపాలెం, పూసపాడు గ్రామాల అభ్యర్థులు నామినేషన్లు వేస్తారన్నారు. 17వ తేదీతో నామినేషన్ల పర్వం ముగుస్తుందని శ్రీనివాసరావు వివరించారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.