అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల పెంపు అంశం శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలి -- అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ డిమాండ్
ఏలూరు, మేజర్ న్యూస్ :తెలుగు రాష్ట్రాల ప్రజల పుష్కరకాల డిమాండ్ అయిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పెంపుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ డిమాండ్ చేశారు.
స్థానిక గన్ బజార్ సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
ఇది మాకు చట్టబద్ధమైన హక్కు అని
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కి, అలాగే పార్లమెంట్ స్థానాలు పెరగాల్సిందన్నారు. సంవత్సరాలు గడిచినా ఇంకా అమలు కాలేదు. ఇది తెలుగు ప్రజలకు జరుగుతున్న తీరని రాజకీయ అన్యాయం. అన్నారు.డిలిమిటేషన్ జరిగినా, జరగకపోయినా ముందుగా చట్టంలో ఉన్న స్థానాల పెంపును అమలు చేయాలి. తెలుగు రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలి అని పేర్కొన్నారు.
తెలుగు ప్రజల హక్కు కోసం ప్రజా సంఘాలన్నీ కలిసి రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ, రౌండ్ టేబుల్ సమావేశాలు, ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని
హరికృష్ణ తెలియజేశారు.
ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు బహుదూర్ సింగ్, కిషోర్ ,నరసింహ సింగ్, పి రామయ్య, వై సునీల్, బి శ్యామ్ , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.