BREAKING
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు! ప్రజాసేవ కోసం ఒక్కసారి అవకాశం కల్పించండి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఇంకొల్లు మండలంలో తొలిరోజు ఆరు నామినేషన్లు సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలి నూతన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మాలిపట్లోళ్ల సంగారెడ్డి. అయ్యప్ప స్వామి సేవలో శాపురం నర్సింహారెడ్డి -పాటి గ్రామంలో ప్రత్యేక పూజలు.. మొదటి రోజు సర్పంచు స్థానానికి 34.. వార్డుల స్థానానికి 31 నామినేషన్ లు....ఎంపీడీవో పీచేరేర్యాగడి కొత్త తండాలో వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల అధ్యక్షులు మల్లన్న పాటిల్ అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల పెంపు అంశం శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలి -- అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ డిమాండ్

మెరుగైన రవాణా సౌకర్యం కోసం సీసీ రోడ్ల నిర్మాణం మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్

Select Suryaa Now
మెరుగైన రవాణా సౌకర్యం కోసం సీసీ రోడ్ల నిర్మాణం మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్

పటాన్‌చెరు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు కాలనీల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం 8వ వార్డులో ప్రజల సౌకర్యార్థం చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వార్డులో రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు నిత్యం రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించవచ్చని తెలిపారు.సీసీ రోడ్ల నిర్మాణంతో కాలనీవాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో రహదారులపై ఏర్పడే ఇబ్బందులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని,నిబంధనల ప్రకారం పనులు చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.రహదారులు,డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్లోళ్ల మాధవి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కిషోర్ రెడ్డి,రాహుల్ రెడ్డి,కాలనీవాసులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.