అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు
ఝరాసంగం ః ఝరాసంగం పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న క్రాంతి పాటిల్ తండ్రి మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని పల్తూరు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణవార్తతో కుటుంబంలో విషాదం నెలకొంది.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పల్తూరు గ్రామానికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొని మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎస్‌ఐ క్రాంతి పాటిల్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవి పటేల్, బోరేగావ్ సర్పంచ్ పట్లోళ్ల నాగేందర్,కాంగ్రెస్ నాయకుడు అశ్విన్ పాటిల్, ఏల్గోయి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగేష్, జీర్లపల్లి బీఆర్ఎస్ నాయకుడు శివమణి, గంగాపూర్ సీనియర్ నాయకులు ఇమ్రాన్, ఉమేష్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు ఒకచోట చేరి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. మృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.